ప్రశ్నలు మరియు సమాధానాలు

మేము వివిధ సందర్భాలలో, మా రైతులతో సంభాషించినప్పుడు, మా KAP సేంద్రీయ ఎరువు గురించి వారి అడిగిన వివిధ ప్రశ్నలకు మేము సమాధానమిచ్చాము. ఈ "ప్రశ్నలు మరియు సమాధానాలు" మా ఉత్పత్తి నాణ్యత ప్రమాణాలు, పదార్థాలు, ఎలా ఉపయోగించాలి, Customer Care పరంగా రూపొందించబడ్డాయి. దయచేసి ఆశాంతం చదవండి !!!

KAP Bio Manure అనేది పశువుల విసర్జితాలు, మొక్కల వ్యర్థం, కూరగాయలు వ్యర్థం, మొదలగు పదార్థాలతో, అత్యంత సహజ పద్ధతి లో పులియపెట్టబడి, వాడుకకు సిద్ధంగా వున్న కర్బన సహిత సేంద్రియ ఎరువు. ప్రస్తుతం అధిక రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారాన్ని కోల్పోయిన నేలని తిరిగి స్థిరపరచి నత్రజని, భాస్వరం మరియు పొటాషియం వంటి స్థూల పోషకాల్ని సమపాళ్లలో అందిస్తుంది.
పోషక విలువల్లో రెండూ ఇంచుమించు ఒక్కటే, కానీ.. KAP Bio Manure పశువుల విసర్జితాలు, మొక్కల వ్యర్థం, కూరగాయల వ్యర్థం మరియు వాతావరణం లో వున్న సహజ బాక్టీరియా తో తయారు చేస్తారు. Vermi Compost పశువుల పెంట మరియు వానపాముల సహాయంతో తయారు చేస్తారు. KAP Bio Manure అనేది ఎక్కువ కాలం పులియపెట్టడం వలన సేంద్రియ కర్బన లభ్యత ఎక్కువ స్థాయిలో ఉంటుంది. పంటలో కలుపు మొక్కల బెడద ఉండదు.
నూటికి నూరు శాతం సేంద్రీయ ఎరువు. కర్బన శాతం ఎక్కువ లభ్యత ఉండి చవుకగా దొరికే ఏకైక సేంద్రీయ ఎరువు.
సేంద్రీయ కర్బన శాతం (SOC) అంటే భూసారం స్థాయిని తెలిపే ఒక సూచిక. మట్టి పరీక్షతో దీన్ని తెలుసుకోవచ్చు. ఇది నేల గాలిని (మట్టిలో ఆక్సిజన్) మరియు నీటి పారుదల మరియు నిలుపుదలని మెరుగుపరుస్తుంది మరియు కోత మరియు పోషకాలు లీచింగ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సూక్ష్మజీవుల సంఖ్యని పెంచి మొక్కకి పోషకాల్ని అందిస్తుంది.
తప్పకుండా వాడొచ్చు . మన రాష్ట్ర రైతులు దుక్కికి ముందు, పశువుల పెంట (లేదా) కోడి పెంట పొలములో వెయ్యటం అలవాటు...అది కూడా ఎకరాకి 6 నుంచి 7 టన్నులు వేస్తున్నారు. అయితే, ఈ పశువుల, కోళ్ల పెంట కూడా 'సేంద్రియ ఎరువు' కిందకే వస్తాయి. కానీ, ఇక్కడ రైతు సోదరులు గమనించవలసిన విషయం ఏమిటంటే, మార్కెట్ లో దొరికే ఈ పశువుల, కోళ్ల పెంటలు పూర్తి స్థాయి de-compose అయినవి ఎంత మాత్రం కావు..వీటి వాళ్ళ భూమికి దొరికే పోషకాల విలువ చాలా తక్కువ స్థాయి లో ఉంటుంది. మా KAP Bio Manure, అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో, అధిక పోషకవిలువలు కల్గి, FCO ప్రమాణాలకు అనుగుణంగా తయారుచెయ్యబడి వున్నది. ఇది 10 టన్నుల పశువుల పెంట కి సమాన పోషక విలువలు కలిగి, కేవలం ఎకరాకి ఒక టన్ను వేస్తే సరిపోతుంది. ధర, మరే ఇతర సేంద్రియ ఎరువుల కంటే చాలా తక్కువగా వున్నది.
ఖచ్చితంగా వాడొచ్చు. మా KAP Bio Manure, అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో, అధిక పోషకవిలువలు కల్గి, FCO ప్రమాణాలకు అనుగుణంగా తయారుచెయ్యబడి వున్నది. ఇది 10 టన్నుల పశువుల పెంట కి సమాన పోషక విలువలు కలిగి, కేవలం ఎకరాకి ఒక టన్ను వేస్తే సరిపోతుంది.
ఎంత మాత్రమూ పెరగదు. KAP Bio Manure అనేది ఎక్కువ కాలం పులియపెట్టడం వలన వాతావరణములో వున్న వేడికి Manure లో వున్న కలుపు విత్తనాలు కూడా సేంద్రియ కర్బనం గా మారిపోతాయి. పంటలో కలుపు మొక్కల బెడద ఉండదు.
ఆహార పంటలకు, వాణిజ్య పంటలకు ఎకరానికి ఒక టన్ను (one Tonne) ఆఖరి దుక్కి లో వెయ్యాలి . పండ్ల తోటలకి మొక్కకి 10 Kgs వెయ్యాలి. కాయకూరలకి mulching తో పాటు ఎకరానికి అర టన్ను (1/2 Tonne) వేస్తె సరిపోతుంది.
KAP Bio Manure అనేది నేలని స్థిరపరిచే ఒక అత్యంత సహజ సేంద్రియ ఎరువు ...పొలానికి ఎంత ఎక్కువ మోతాదు వేసినా ఏమీ నష్టం లేదు.
KAP Bio Manure, అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో, అధిక పోషకవిలువలు కల్గి, FCO (Fertilizer Control Order, 1985) ప్రమాణాలకు అనుగుణంగా తయారుచెయ్యబడి వున్నది.
రైతులకు సరైన సమయంలో సరైన నాణ్యమైన ఎరువులు, మరియు సరైన ధరకు తగినన్ని లభ్యతను నిర్ధారించడానికి, ఎరువులు ఒక నిత్యావసర వస్తువుగా ప్రకటించబడ్డాయి. దీనికి గాను ఎరువుల నియంత్రణ ఉత్తర్వు (FCO) ఇవ్వటం జరిగింది. దేశంలో ఎరువుల ధర, నాణ్యత మరియు పంపిణీ దీని క్రిందకి వస్తాయి.
KAP Bio Manure, FCO (Fertilizer Control Order, 1985) నాణ్యతా ప్రమాణాలకు లోబడి తేమ శాతం ఉంచటం జరిగింది. FCO ప్రకారం ఏ సేంద్రియ ఎరువులో అయినా తేమ శాతం 15 నుంచి 25 వరుకు ఉండాలి. KAP Bio Manure లో 23 శాతం వుంది.
అవును, అయితే KAP Bio Manure మరియు రసాయన ఎరువుల వాడకం మధ్య కనీసం 30 రోజుల గ్యాప్‌ ఉండాలి.
ఎరువుకి సంబంధించినంత వరుకు pH అనేది ఎరువు యొక్క ఆమ్లత్వం లేదా క్షార గుణం తెలిపే ఒక కొలత. మొక్కలకి పోషకాల లభ్యత సరైన రీతిలో ఉండి, వాటి పెరుగుదలకు pH పరిధి 6.5–7.5 సరైనది. ఇది మట్టి సూక్ష్మజీవుల మనుగడ మరియు వాటి వృద్ధికి దోహదం చేస్తుంది తద్వారా నేలలో ఉన్న కార్బన్ శాతం పెరుగుతుంది.
విద్యుత్ వాహకత (EC) అనేది సేంద్రియ ఎరువు లోని లవణాల పరిమాణం (లవణీయత) యొక్క కొలత. ఇది మొక్కకి పోషకాల లభ్యత మరియు అందుబాటులో ఉన్న నీటి సామర్థ్యంని సూచిస్తుంది.
KAP Bio Manure లో ఎటువంటి నాణ్యతా లోపం లేదు. ఇంత తక్కువ ధర ఉండడానికి కారణం.. మా ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం మేము ఏనాడూ పెద్ద పెద్ద (టీవీ, పేపర్ ) ప్రచార ఆర్భాటాల జోలికి వెళ్ళలేదు...దళారీ వ్యవస్థని నమ్ముకోలేదు..కేవలము మేము వాట్సాప్ , సోషల్ మీడియా లను మాత్రమే ప్రచార సాధనాలుగా వాడుకుని, రైతు దృష్టిలోకి వెళ్ళాము..తద్వారా, మన Manure ఖరీదు ను అదుపులో ఉంచ కలిగాము.."Factory To Farmer" అనేది మా నినాదం.
మనం కొన్ని సంవత్సరాలుగా రసాయన ఎరువులు వాడటం వలన మన భూమి ఇప్పటికే నిస్సారం అయింది. ఇప్పుడు ఒక్కసారిగా, రసాయన ఎరువులు ఆపి సేంద్రియ ఎరువులు మొదలుపెట్టకూడదు... మన ప్రియతమ ప్రధాని శ్రీ మోదీ గారు చెప్పినట్లు గా, "కొద్దీ కొద్దీగా మన భూమిని సేంద్రియ ఎరువులకి అలవాటు చెయ్యవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది, తద్వారా రాబోయే తరాలకి రసాయనరహిత ఆహారాన్ని అందించిన వారము అవుతాం".
KAP Bio Manure ఒక సేంద్రియ ఎరువు ...రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయం కాదు. రసాయన ఎరువులతో కలిపి వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి మరియు ఖర్చు భారీగా తగ్గించు కోవచ్చు
సరైన సేంద్రియ ఎరువు ఎప్పుడూ చెడు వాసన రాదు మరియు ముదురు గోధుమరంగు లో ఉంటుంది. తేమ శాతం 25% మించి ఉండదు.
KAP Bio Manure అనేది భూమిలో కలపటం కోసం నిర్దేశించబడిన ఒక సేంద్రియ ఎరువు...మొక్కల పైన, ఆకుల మీద జల్ల రాదు.
Packing చేసిన దగ్గర నుంచి 10 నెలలు.
KAP Bio Manure అనేది పశువుల విసర్జితాలు, మొక్కల వ్యర్థం, కూరగాయలు వ్యర్థం, మొదలగు పదార్థాలతో, అత్యంత సహజ పద్ధతి లో పులియపెట్టబడి తయారు చేస్తారు. ఎటువంటి రసాయన అవశేషాలు ఉండే అవకాశం లేదు.
మా ప్రతీ Bag మీద Customer Care Number ఉంటుంది. Landline : +91 40 4002 5505, 4261 5505. Whatsapp number : +91 897 7775505, 728 602 5505.