మా ఉత్పత్తులు

KAP N-Riched Bio Manure 50Kg Bag

ఆహార, పండ్లు, మరియు కూరగాయల పంటలకు ఉత్తమమైనది.

KAP N-Riched Bio Manure 25Kg Bag

ఆహార, పండ్లు, మరియు కూరగాయల పంటలకు ఉత్తమమైనది.

KAP Bio Manure 5Kg Packet

మొక్కల నర్సరీ, గార్డెనింగ్ మరియు ల్యాండ్‌స్కేపింగ్‌కు అనువైనది.

KAP Bio Manure 1Kg Packet

ఇల్లు, బాల్కనీ, రూఫ్ మరియు కిచెన్ గార్డెనింగ్ కోసం ఉత్తమమైనది.

KAP సేంద్రీయ ఎరువు తగినంత మొత్తంలో స్థూల మరియు సూక్ష్మపోషకాలను జోడించడం ద్వారా నేలను సుసంపన్నం చేస్తుంది. నత్రజని, పొటాష్ మరియు భాస్వరం వంటి పోషకాలతో పాటు, పంటకు కాల్షియం, మెగ్నీషియం, బోరాన్, జింక్ మరియు మాంగనీస్ వంటి సూక్ష్మపోషకాలు కూడా లభిస్తాయి.
నత్రజని, భాస్వరం మరియు పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన, మా KAP సేంద్రీయ ఎరువు మొక్కల పెరుగుదల మరియు వేరు వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతుంది.
మట్టిని సారవంతం చేసే సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుతుంది, తద్వారా భూమి సేంద్రీయ కార్బన్‌ను పొందుతుంది. మన KAP సేంద్రీయ ఎరువులో 17% కంటే ఎక్కువ వున్న సేంద్రియ పదార్ధం నేలకు తెగుళ్ళ బాధ నుంచి తప్పిస్తుంది.
KAP సేంద్రీయ ఎరువును కలిపి జీవన ఎరువులను వేయడం వల్ల రసాయనిక ఎరువులను తగ్గించవచ్చు. తెగుళ్లకు పంట నిరోధకతను పెంచుతుంది. అందువల్ల పురుగుమందుల ఖర్చు కూడా బాగా తగ్గుతుంది.
KAP సేంద్రీయ ఎరువు నేల నిర్మాణాన్ని మెరుగుపరచడం ద్వారా నేల కోతను నిరోధిస్తుంది, పోషకాల యొక్క సీజన్-పొడవునా సరఫరా, మరియు నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.

KAP సేంద్రీయ ఎరువు ఎందుకు?

KAP సేంద్రీయ ఎరువు 100% సేంద్రీయ ఎరువు, ముదురు గోధుమ రంగులో ఉంటుంది, ఇది మొక్కలకు అవసరమైన కీలక పోషకాలను అందించగలదు. ఇందులో నైట్రోజన్-ఫిక్సింగ్ మైక్రోబ్స్, ఫాస్ఫేట్ సోలబిలైజ్ మరియు పొటాషియం మొబిలైజర్‌తో పాటు సేంద్రీయ పదార్థం ఉంటుంది. కాబట్టి, ఇది నేల నాణ్యతను మరియు దాని సారాన్ని మెరుగుపరుస్తుంది, నేల యొక్క నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది మరియు తెగుళ్లు మరియు వ్యాధుల ముప్పును నివారిస్తుంది. KAP సేంద్రీయ ఎరువు విషపూరితం కాదు మరియు పర్యావరణ అనుకూలమైనది.

  • ఇది అత్యంత సహజంగా పులియబెట్టిన, సేంద్రీయ పదార్థంతో ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న ఎరువు.
  • పంటకు అవసరమైన SOC, N, P, K మరియు సూక్ష్మపోషకాల లభ్యత.
  • ఎరువులో తేమ శాతం సమతూకం .
  • KAP సేంద్రీయ ఎరువులో ఏముంది?

    మా KAP సేంద్రీయ ఎరువు 'కంపోస్ట్ సేంద్రీయ ఎరువు' వర్గం క్రింద వస్తుంది. కంపోస్ట్ సేంద్రీయ ఎరువులకు సంబంధించి FCO (ఎరువుల నియంత్రణ ఆర్డర్) కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. వారి మార్గదర్శకాలను అనుసరించి, సేంద్రీయ ఎరువులు తయారు చేస్తారు. FCO మార్గదర్శకాల ప్రకారం, మా KAP సేంద్రీయ ఎరువులో pH, సాంద్రత, సేంద్రీయ పదార్థం, తేమ, స్థూల మరియు సూక్ష్మపోషకాలు వున్నాయి. తేమ శాతం, స్థూల మరియు సూక్ష్మపోషకాలు వాటి బరువును గ్రాముల ద్వారా కొలుస్తారు (% by weight).

    మా Lab నివేదిక ప్రకారం: ఒక కేజీ ఎరువులో 170 గ్రాముల సేంద్రీయ పదార్థం, 230 గ్రాముల తేమ, 12 గ్రాముల నత్రజని, 7 గ్రాముల భాస్వరం, 11 గ్రాముల పొటాషియం, 7 గ్రాముల కాల్షియం, 1.6 గ్రాముల మెగ్నీషియం, 1.5 గ్రాములు సల్ఫర్ మరియు అతి తక్కువ శాతం సూక్ష్మపోషకాలు వున్నాయి. మిగిలిన 560 గ్రాములు ఇసుక (Silica),మట్టి (Soil)మరియు తేలికైన (3 mm పరిమాణం) రాళ్లను కలిగి ఉంటాయి.